logo

పాఠశాలలో శ్రీ పంచమి వేడుకల్లో బాగంగా శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ.

చీపురుపల్లి: మండలంలోని గొల్లలములగాం గ్రామంలో ఈరోజు సరస్వతి దేవి విగ్రహం ఆవిష్కరణ అత్యంత వైభవంగా వేదమంత్రంతో శాస్త్రోక్తoగా ఆవిష్కరించారు. గ్రామంలో యువత కొంత మంది కలిసి వారి డబ్బులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ పంచమి పర్వదినంన గ్రామ పురోహితులు కార్తీక్ శర్మ గారు వేద మంత్రాలతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల చైర్మన్ గడే.సత్యoనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు యువత జి.శ్రీరాములు, కే. రాంబాబు. జి.దామోదరరావు.s.సంతోష్ కుమార్,మరి కొంత మంది స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

4
36 views