logo

వార్తల ప్రచురణలో ప్రజా కలం బేస్.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

జగిత్యాల్ ప్రతినిధి (తరి రాజశేఖర్) జనవరి 22 : ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు దోహదపడే వార్తలను ప్రచురించడంలో ప్రజా కలం దినపత్రిక అగ్రభాగాన నిలుస్తుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా కలం దినపత్రిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో ప్రజా కలం దిన పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎస్పీ అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజా సమస్యలను వెలికితీస్తూ వాటి పరిష్కారంలో ప్రజా కలం ముందుంటుందని. ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా ప్రజా కలం విలేకరులు కథనాలు ప్రచురించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా కలం గొల్లపల్లి రిపోర్టర్ స్వామి గౌడ్, ఎండపల్లి రిపోర్టర్ గుండ గంగయ్య, మెట్‌పల్లి రూరల్ రిపోర్టర్ కుర్ర రాజేందర్, టీయూడబ్ల్యూజే ఐజేయు. జగిత్యాల జిల్లా ఈసీ మెంబర్ షేక్ సాజిత్, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా జాయింట్ సెక్రటరీ పింజారి శివ కుమార్, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

3
487 views