logo

పల్లోటి గ్లోబల్ స్కూల్ స్పోర్ట్స్ అన్యువల్ డేలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

పిల్లలకు ఆశీస్సులు – నాణ్యమైన విద్య అందిస్తున్న యాజమాన్యానికి అభినందనలు..
గురువారం నాడు నందిగామ పట్టణంలోని పల్లోటి గ్లోబల్ ఇంగ్లీష్ మీడియంస్కూల్‌లో నిర్వహించిన స్పోర్ట్స్ అన్యువల్ డే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి మరియు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి పేరు సంపాదించిన పల్లోటి గ్లోబల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఆమె తన ఆశీస్సులు అందజేశారు. ఆటలలో గెలుపు–ఓటములు సహజమని, ఓటమి రాబోయే గెలుపుకు పునాదిరాయిగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విశిష్ట కార్యక్రమానికి ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

5
84 views