logo

అనంతపురం నగర సమస్యలపై, అభివృద్ధి పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ ఇమామ్.✨

అనంతపురం నగర సమస్యలపై, అభివృద్ధి పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ ఇమామ్*✨
సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల తో కలిపి అనంతపురం నగరంలో జరుగుతున్న పరిణామాలు ఆటంకాలు-అభివృద్ధి అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున సిటీ ప్రెసిడెంట్ ఇమామ్ గారు పాల్గొని అనంతపురం నగరంలో జరుగుతున్న పరిణామాలు, ఆటంకాలు, నగర అభివృద్ధి పై ప్రజలు ఇబ్బందులపై తన గళాన్ని వినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ* అనంతపురం నగరంలో ఎన్నడూ లేని పరిణామాలు, సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి.. ఎన్నికల్లో కల్లిబొల్లి మాటలతో మాయచేసి ఎన్నికైన తరువాత ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా, హుందాతనంగా మెలగాలి, ప్రజా సేవ ఒక బాధ్యత ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం పాటుపడాలి కానీ వారిని సంక్షోభంలో నెడుతూ ఇబ్బందులకు గురి చేయడానికి కాదు. ఇలాగే కొనసాగితే ప్రజలే తిరగబడి గెట్టిగా సమాధానం చెబుతారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా నగరాభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎల్లపుడు అండగా నిలుస్తామని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ ఇమామ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని నగరంలోని సమస్యల మీద చర్చించడం జరిగింది.

0
111 views