logo

*పారా ప్రపంచ గ్రాండ్ ప్రిక్స్ పోటీలకు పైడిరాము ఎంపిక :* *ప్రపంచ వేదికపై సత్తా చాటాలి : -పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దయానంద్*


దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 5 నుండి 14 వరకు జరగబోయే *17 వ ఫాజా ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ -2026* పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన కొత్తింటి పైడిరాము ఎంపికయ్యారని, ఇది జిల్లాకు వచ్చిన గొప్ప అవకాశమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ పైడిరాముకు అభినందనలు తెలియజేసారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కొత్తింటి పైడిరాము ఎఫ్ -51 కేటగిరి లో డిస్కస్ త్రో ఈవెంట్ లో పాల్గొంటారని అన్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరపున పాల్గొని అనేక మెడల్స్ గెలుచుకున్న పైడిరాము దుబాయ్ లోనూ సత్తా చాటుతారన్న ఆశాభావాన్ని దయానంద్ వ్యక్తం చేసారు. ప్రపంచ పోటీలకు ఎంపికైన పైడిరాముకు కలెక్టర్ రాం సుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావులు శుభాకాంక్షలు తెలియజేసారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి జిల్లా కు, రాష్ట్రానికీ, దేశానికీ మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.

1
232 views