logo

నిబంధనల ప్రకారం పిజిఆర్‌ఎస్ తదితర మార్గాల ద్వారా వచ్చిన గ్రీవెన్స్ ని, రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం.


జిల్లా జీడీపీ పెంచేందుకు చర్యలు తీసుకుంటాం..
నిబంధనల ప్రకారం పిజిఆర్‌ఎస్ తదితర మార్గాల ద్వారా వచ్చిన గ్రీవెన్స్ ని, రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం.
-నూతన జిల్లా సంయుక్త కలెక్టర్, ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్..
కలెక్టరేట్ లో అనంతపురం జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంచార్జి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సి.విష్ణు చరణ్.
అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా సి.విష్ణు చరణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇంచార్జి జిల్లా కలెక్టర్ గా కూడా బాధ్యతలను స్వీకరించారు. బుధవారం జిల్లా సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్, ఇంఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ నుంచి నూతన సంయుక్త కలెక్టర్ గా, ఇంచార్జి జిల్లా కలెక్టర్ గా సి.విష్ణు చరణ్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మీడియాతో నూతన జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ తాను 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్‌ అని, తాజాగా జరిగిన బదిలీలలో భాగంగా అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్‌గా నియమించడం జరిగిందన్నారు. దీనికంటే ముందు తాను చిత్తూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశానని, తరువాత వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురం సబ్ డివిజన్‌కి సబ్ కలెక్టర్‌గా, ఐటిడిఏ పార్వతీపురం ప్రాజెక్ట్ అధికారిగా పని చేశానన్నారు. అనంతరం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశానని, తదనంతరం సోషల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ సెక్రటరీ కూడా పని చేశానని తెలిపారు. ఈరోజు అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నానన్నారు.
ప్రతి మూడు నెలలకి ఒకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నారని, ప్రతి జిల్లా అభివృద్ధికి కావలసిన అంశాలపై, ఉన్నాయనీ, పురోగతిపై వివరించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా జీడిపి పెంచడం అన్నది ప్రతి జిల్లాకి సీయం గారు చాలా ప్రత్యేకంగా తీసుకున్న ఒక అంశం అన్నారు. ఏ విధంగా అయితే మన జిల్లాకి జీడిపి పెంచగలమో దాని ప్రకారం అన్ని సెక్టర్స్ లో కూడా.. ప్రైమరీ, సెకండరీ, అన్ని సెక్టర్స్ లో కూడా ఏ విధంగా అయితే మనం పెంచగలమో అవన్నీ కూడా ప్రయత్నిస్తామన్నారు. రెవెన్యూ సమస్యలు అన్నవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయని, ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా త్వరితగతిన పిజిఆర్‌ఎస్ లో వచ్చిన గ్రీవెన్స్ కానీ, రెగ్యులర్‌గా వస్తున్న గ్రీవెన్స్ కానీ ఏవైనా సరే నిబంధనల ప్రకారం అన్ని కూడా పరిష్కారం చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి పిజిఆర్‌ఎస్ లో, రాష్ట్ర స్థాయిలో ఒక 70 నుంచి 80 శాతం గ్రీవెన్స్ అన్నీ కూడా రెవెన్యూ పైన వస్తున్నాయని చెప్పడం జరిగిందని, మన జిల్లాలో పరిస్థితి ఏంటనేది ఒకసారి సమీక్ష చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారం చేయగలమో అప్పుడే చాలా వరకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రీవెన్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా నిబంధనల ప్రకారం పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ డ్యూటీ చార్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు ఉంటాయని, ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉంటే సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయన్నారు. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ, స్ఫూర్తిని ఇస్తూ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేస్తామన్నారు.
అంతకుముందు కలెక్టరేట్ కు చేరుకున్న నూతన సంయుక్త కలెక్టర్ సి.విష్ణు చరణ్ గారికి డిఆర్ఓ ఎ.మలోల, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు యోగేశ్వరి దేవి, రియాజుద్దీన్, వసంతలత, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జున ప్రసాద్, తదితరులు పూలమొక్కలు అందించి మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఆర్డీఓ కేశవ నాయుడు, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణరెడ్డి, ఎస్డీసి ఆనంద్, సిపిఓ అశోక్ కుమార్, జిజిహెచ్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు హరికుమార్, మోహన్ కుమార్, నాగరాజు, ల్యాండ్ రిఫామ్స్ స్పెషల్ తహసీల్దార్ వేణుగోపాల్, కలెక్టరేట్ అధికారులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

1
114 views