logo

పీఎం కుసుమ్ కింద పది రోజుల్లోగా అన్ని ప్రాంతాల్లో పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం..



పీఎం కుసుమ్ కింద పది రోజుల్లోగా అన్ని ప్రాంతాల్లో పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం..

ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్
తిరుపతిలోని ఏపీఎస్పీడిసిఎల్ కార్యాలయం నుంచి పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం మరియు అన్ని ఎన్ఆర్ఈడిసిఏపి ప్రాజెక్టులపై వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సంయుక్త కలెక్టర్, ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఏపీఎస్పీడీసీఎల్, నెడ్ కాప్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం కుసుమ్ కింద జిల్లాలో 20 ప్రాంతాల్లో 111 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పది రోజుల్లో మొదలుపెట్టేలా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే జరుగుతున్న పనులు వేగవంతంగా చేపడతామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీఎస్పీడీసీఎల్ ఈఈలు జేవి.రమేష్, పద్మనాభ పిళ్లై, రాజశేఖర్, కన్స్ట్రక్షన్స్ ఈఈ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

3
168 views