logo

నంద్యాలలో అయోధ్య రామ మందిర నమూనా గల ఎగ్జిబిషన్‌.

నంద్యాల (ప్రజా పక్షం): నంద్యాల మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు అపూర్వమైన దైవ దర్శనావకాశం లభించింది. నంద్యాల పట్టణంలో తొలిసారిగా శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌లో శ్రీ అయోధ్య రామ మందిరం అద్భుత నమూనాను భక్తుల దర్శనార్థం ఉంచారు.భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య శ్రీ రామ మందిరాన్ని అచ్చుగుద్దినట్టుగా ప్రతిబింబించే ఈ నమూనా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యంత నిశితంగా నిర్మించిన ఈ నమూనా ద్వారా అయోధ్య రామ మందిర వైభవాన్ని నంద్యాలలోనే వీక్షించే అరుదైన అవకాశం లభిస్తోంది.ఈ ఎగ్జిబిషన్‌కు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు శీను తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శ్రీనివాస చౌదరి వెల్లడించారు.దైవ భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా రూపొందించిన ఈ అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శనను ప్రతి ఒక్కరూ వీక్షించి దైవానుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.

6
255 views