logo

చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్,

చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్
చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్,

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విజయవంతం అవడం పట్ల కడప జిల్లా చిరంజీవి యువత సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం కడప రమేష్ థియేటర్ లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కడప జనసేన పార్టీ నాయకులు సంఘపట్నం నవీన్ కుమార్, మరియు కడప మెగా అభిమాని జావిద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేక్ కట్ చేసి, థియేటర్ సిబ్బందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రమేష్ థియేటర్ యాజమాని తిరుమల శెట్టి సుబ్బయ్య కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ పాల్గొని వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవి సినిమా కుటుంబ సమేతంగా చూడదగిందని పెద్దమనుషుల నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ చూసి ఆనందించే చిత్రమని పేర్కొన్నారు.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన మన శంకర వరప్రసాద్ సినిమా హిట్ కొట్టడం అత్యధిక కలెక్షన్లు వసూలు చేయడం మా అందరికీ ఆనందదాయకమని తెలిపారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని చేకూర్చాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గణేష్, బ్రహ్మం నాయక్, పండ్ర వంశీకృష్ణ, జోగి రాజేష్, నాగరాజ్, అతికారి నాగేంద్ర, వాకా అంజి, పాటుకూరు నాగేంద్ర, గౌస్ లాజం, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, గోపాల్, శివకుమార్, మల్లికార్జున కిరణ్, రామకృష్ణ, సద్దాం, మెగా అభిమానులు పాల్గొన్నారు.

2
693 views