logo

జనశక్తిపేరుతోడబ్బులువసూల్

రాజన్న సిరిసిల్ల జిల్లా లో జనశక్తి పేరుతో బెదిరింపులకు గురిచేస్తు డబ్బులు వసూలు చేసే ముఠా సభ్యుడు అరెస్ట్,రిమాండ్
ఒక కంట్రిమేడ్ పిస్టోల్,ఒక ఎక్సట్రా మ్యాక్జిన్,08 రౌండ్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి,జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్న నలుగురు నింధితులను (తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, వంజరి సురేందర్ @ విశ్వనాథ్ బాదం సూర్య ప్రకాష్ రెడ్డి,పయ్యావుల గోవర్ధన్) లను ఈనెల 07 వతేదీన అరెస్ట్ చేసి 9ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకొని రిమాండ్ చేయడం జరిగింది అట్టి కేసు దర్యాప్తులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్ముడ్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సుధాపల్లి సుధాకర్ వయస్సు50 ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామానికి చెందిన బోయిని దేవరాజు అగయ్య, 49 సం,నల్లగోండ జిల్లా ఉట్కూర్ గౌరారం మండలం చెందిన దుబ్బ మధు వయస్సు30, పై నలుగురు నిందుతులతో సంబంధం పెట్టుకొని జనశక్తి పేరుతో డబ్బున్న వ్యక్తులను బెదిరింపుల గురి చేసి డబ్బులు వసూలు చేయడం,రియల్ ఎస్టేట్, భూమి వివాదంలో జోక్యం చేసుకొని వారిని బెదిరించడం ద్వారా డబ్బులు అధికంగా సంపాదించవచ్చని ప్లాన్ వేసుకోగా సూడపెళ్లి సుధాకర్,బోయిని దేవరాజు ను ఈనెల 09 తేదీన అదుపులోకి తీసుకిని రిమాండ్ చేయడం జరిగిందని,దుబ్బా మధును ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని అతని వద్ద ఒక కంట్రిమేడ్ పిస్టోల్,ఒక ఎక్సట్రా మ్యాక్జిన్, 08 రౌండ్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

52
4445 views