logo

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే అమిలినేని*

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే అమిలినేని.
ప్రతి నిత్యం ప్రజలకు సమస్యలు పరిష్కారం కోసం పరితపించే వ్యక్తి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు..ఉదయం నుంచి తనను కలిసేందుకు వచ్చే ప్రతి వ్యక్తిని కూర్చోపెట్టుకుని వారి నుంచి అర్జీలు తీసుకుని ఎన్ని రోజుల నుంచి ఉంది ఎందుకు సమస్య పరిష్కారం కాకుండా ఉన్నాయని వెను వెంటనే సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ చేసి సమస్య ఎందుకు పరిష్కరించలేదు, ఇప్పుడు ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో చెప్పండి అంటూ అధికారులను ఆరా తీశారు..అలాగే కంబదూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఒక పెద్దావిడ తనకు నడవటం కావడం లేదని, ఇల్లు కూడా లేదని అడగ్గా వెంటనే కంబదూరు మండల నాయకులను పిలిచి వెంటనే ఇంటికి, ఇంటి పట్టా ఇప్పించాలని, 25 రోజుల్లో ట్రై సైకిల్ తానే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.. పాలవాయి గ్రామంలో పంచాయతి కార్యదర్శి కనీస అవసరాలు అయిన తాగునీరు, పారిశుధ్యం గురించి ఎన్ని సార్లు అడిగినా స్పందించడం లేదని గ్రామస్థులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే ఎంపీడీఓకు ఫోన్ చేసి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కావాలని లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు సిపార్సు చేస్తామని తెలిపారు..గ్రామంలో నీటి కొరత కూడా ఉందని రెండు రోజుల్లో నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు..రెవెన్యూ సమస్యలపై వచ్చిన వారివి పరిష్కారం కోసం వెంటనే సంబంధిత రెవెన్యూ, ఆర్డీఓలతో మాట్లాడి వెంటనే పరిష్కారించాలని తెలిపారు. పింఛన్లు వచ్చే మార్చి తరువాత వస్తాయనిఅప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని తెలిపారు..

0
58 views