logo

✒️- జీవితాంతం కలిసుండి.. ఒకేసారి వెళ్లిపోయారు

జర్నలిస్టు : మాకోటి మహేష్

పెళ్లిలో అగ్నిసాక్షిగా 'జీవితాంతం తోడుంటా' అని ఇచ్చిన మాటను ఈ వృద్ధ దంపతులు నిజం చేశారు. బిహార్లోని సమస్తీపూర్లో 90 ఏళ్ల భర్త మరణించగా.. పాడె కడుతున్న సమయంలోనే భార్య కూడా ప్రాణాలు విడిచారు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన వెంటే తనువు చాలించిన ఆమె ప్రేమను చూసి అంతా కన్నీరు మున్నీరయ్యారు. మరణం కూడా విడదీయలేని వీరి అపూర్వ బంధం చూసి 'నిజమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం' అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు~

1
0 views