వెలుగు కార్యాలయంలో ఈనారి LH-CRP కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్
AiMA న్యూస్:
*▪️పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం – ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు...*
*▪️పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన ఈనారీ, LH–CRP కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో పేద మహిళల అవసరాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ పథకాల అనుసంధానం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు.మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబం, సమాజ అభివృద్ధికి పునాదని పేర్కొంటూ,ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అభివృద్ధి చెందాలనే ప్రభుత్వ లక్ష్య సాధనకు ఈనారీ, CRP వ్యవస్థ కీలకమని ఎమ్మెల్యే గారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మహిళ సోదరిమణులు,పాల్గొన్నారు.*