logo

నిశ్శబ్ద మరణాలు" – సుప్రీం కోర్టు సంచలన తీర్పు (జనవరి 15, 2026) కేసు:

"నిశ్శబ్ద మరణాలు" – సుప్రీం కోర్టు సంచలన తీర్పు (జనవరి 15, 2026)
కేసు: Amit Kumar v. Union of India (2026 INSC 62)
జడ్జ్‌లు: జస్టిస్ J.B. పార్దివాలా & ఆర్. మహదేవన్
ఐఐటీ ఢిల్లీలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు (కుల వివక్ష + అకడమిక్ ఒత్తిడి) తల్లిదండ్రుల పిటిషన్‌పై సుప్రీం కోర్టు బలమైన ఆదేశాలు ఇచ్చింది.

@ ముఖ్య ఆదేశాలు – ఇకపై ఇలా జరగకూడదు!
-విద్యార్థి ఆత్మహత్య లేదా అసహజ మరణం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు రిపోర్ట్ చేయాలి.
-క్యాంపస్‌లోనైనా, హాస్టల్‌లోనైనా, PGలోనైనా, బయటైనా – జాప్యం చేస్తే కఠిన చర్యలు!
-ప్రతి HEI (కాలేజీ/యూనివర్సిటీ) వార్షిక రిపోర్ట్ UGC, AICTE, NMC వంటి బాడీలకు ఇవ్వాలి.
-రెసిడెన్షియల్ కాలేజీల్లో 24/7 మెడికల్ సహాయం తప్పనిసరి (క్యాంపస్‌లో లేకపోతే 1 కి.మీ. దూరంలో).
-స్కాలర్‌షిప్ ఆలస్యాలు జరగకుండా 4 నెలల్లో క్లియర్ చేయాలి.
-ఆలస్యం వల్ల హాస్టల్ నుంచి బయటకు పంపడం, ఎగ్జామ్‌లకు అనుమతి లేకుండా చేయడం – నిషేధం! కఠిన చర్యలు ఉంటాయి.
-వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, ఫ్యాకల్టీ ఖాళీలు 4 నెలల్లో భర్తీ చేయాలి.
-ర్యాగింగ్, కుల/లింగ వివక్ష, సెక్సువల్ హ్యారస్‌మెంట్ – -UGC రెగ్యులేషన్స్ పూర్తిగా అమలు చేయాలి.
-15-29 ఏళ్ల ఆత్మహత్యల డేటా సెంట్రల్‌గా మెయింటైన్ చేయాలి. NCRB రిపోర్టుల్లో స్టూడెంట్ సూసైడ్స్ వేరుగా చూపించాలి.
@ ఎందుకు ఇలాంటి ఆదేశాలు?
-NTF ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం: అకడమిక్ ఒత్తిడి, ర్యాగింగ్, కుల వివక్ష, స్కాలర్‌షిప్ ఆలస్యాలు, మెంటల్ హెల్త్ సపోర్ట్ లేకపోవడం ప్రధాన కారణాలు.
65%+ కాలేజీల్లో మెంటల్ హెల్త్ సర్వీసెస్ లేవు!
2022లోనే 13,000+ స్టూడెంట్ సూసైడ్స్ రిపోర్ట్ అయ్యాయి.
@ సుప్రీం కోర్టు చెప్పినట్లు...
-ఆత్మహత్యలు కనిపించే "ఐస్‌బర్గ్ టిప్" మాత్రమే. దీని కింద ఉన్న పెద్ద సమస్యలు: కుల వివక్ష, భాషా ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిడి, ఫ్యాకల్టీ ఖాళీలు...
@ మార్పు ఎలా రావాలి?
-తోటి విద్యార్థులే కౌన్సెలింగ్ ఇవ్వడం
-మెంటార్-మెంటీ సిస్టమ్ (ప్రతి 15-20 మందికి ఒక ప్రొఫెసర్)
-సహాయం కోరడం బలహీనత కాదు – అన్న అవగాహన కల్పించాలి!
@ తల్లిదండ్రులకు సూచన:
-మార్కులు, ర్యాంకుల కంటే "నీ ఆరోగ్యం, నీ ప్రాణం మాకు ముఖ్యం" అని పిల్లలకు చెప్పండి. ధైర్యంగా మాట్లాడండి! ❤️
-ఈ సమాచారం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. మన బిడ్డల రక్షణ మన బాధ్యత!

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
ఫోన్: +91 63053 13558
ఈమెయిల్: parentsassociationap@gmail.com

0
0 views