logo

కొవ్వూరు లో గౌరీపరమేశ్వరుల తీర్థ మహోత్సవాలు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో గౌరీపరమేశ్వరుల తీర్థ మహోత్సవాలు.. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
వేషాలు, ఊరేగింపులు, నృత్యాలు, నాటకం.. భక్తి ఉల్లాసాలతో జనవరి 29 నుంచి 31 వరకు కడురంగా జరుగనున్నాయి. మాజీ సర్పంచ్ కోలిపల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, వివేకానంద యూత్ కొవ్వూరు సంఘాలు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. అమ్మవారి ప్రత్యేక పూజలు, వివిధ వేషాలు, బారీ ఊరేగింపు, డ్యాన్స్ ప్రోగ్రాములు, సాంఘిక నాటకం.. మూడు రోజులు గ్రామం భక్తి సాంస్కృతిక రంగులతో మెరిసిపోతుంది.29 జనవరి: ప్రత్యేక పూజలు, గౌరీ పరమేశ్వరుల ఊరేగింపు
ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం. 8 గంటల నుంచి పగటి వేషాలు వేసుకుని భక్తులను అలరిస్తారు. రా. 9 గంటలకు వైజాగ్ భాస్కర్ ఈవెంట్స్ వారు 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' ప్రోగ్రామ్‌తో యువతను ఆకట్టుకుంటారు.30 జనవరి: బారీ ఊరేగింపు, వేషాల మహోత్సవం
ఉదయం 9 గంటల నుంచి నేలవేషాలు, పగటి వేషాలు వేయబడతాయి. రాత్రి 6 గంటల నుండి ఉత్సవమూర్తి ఊరేగింపు ప్రధాన ఆకర్షణ. వైజాగ్ వారి దాండియా డ్యాన్స్, తాడేపల్లి గూడెం వారి శక్తి వేషాలు, వైజాగ్ ధూమ్ థాడక్, వడ్డాది వారి వెంకటేశ్వర స్వామి వేషాలు, కొంతలం వారి చిడతలు.. కని విని ఎరిగినీ లైటింగ్ సెట్టింగ్‌లు, బారీ మందుగుండి సామగ్రితో ఈ ఊరేగింపు కడురమ్యంగా సాగుతుంది. 7 గంటలకు నాని సౌండ్స్‌తో వైజాగ్ భాస్కర్ మరో 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్'. 10 గంటలకు శ్రీ శ్రీ శ్రీ బాలగణపతి నాట్యమండలి 'బెబ్బులి' అనే సాంఘిక నాటకం ప్రదర్శించబడుతుంది.31 జనవరి
ఉదయం 9 గంటల నుంచి డీజే సౌండ్స్‌తో భజన బృందాలు గౌరీపరమేశ్వరుల నిమజ్జన కార్యక్రమాన్ని ఘోరంగా నిర్వహిస్తాయి.ఈ ఉత్సవాలతో గ్రామ ప్రజలు ఆనందంగా ఉంటారని మాజీ సర్పంచ్ ఈశ్వరరావు తెలిపారు. అందరూ పాల్గొని అమ్మవారి కృప పొందాలని కోరారు

3
542 views