logo

జాతీయ స్థాయి కవితా పోటీల్లో నంద్యాల రచయితకు ద్వితీయ బహుమతి.

నంద్యాల (ప్రజా పక్షం): రవళి మాస పత్రిక మరియు శ్రీ రాయపోలు సత్యప్రసాద్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీల్లో నంద్యాలకు చెందిన ప్రముఖ రచయిత కొప్పుల ప్రసాద్ ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన రాసిన “చూపుడు వేలి ప్రశ్న” అనే కవితకు ఈ గౌరవం దక్కింది.ఈ పోటీల వివరాలను రవళి పత్రిక నిర్వాహకులు రాము వెల్లడిస్తూ.. దేశవ్యాప్తంగా దాదాపు 800కు పైగా కవితలు వచ్చాయని తెలిపారు. వాటిలో అత్యుత్తమమైన 9 కవితలను ఎంపిక చేశామని, అందులో కొప్పుల ప్రసాద్ కవిత ద్వితీయ స్థానంలో నిలిచి నగదు బహుమతికి ఎంపికైందని ఆయన పేర్కొన్నారు.జాతీయ స్థాయిలో నంద్యాల పేరును చాటిన కొప్పుల ప్రసాద్‌ ను పలువురు సాహితీ మిత్రులు,, న్యూక్లియస్ కళాశాల యాజమాన్యం మురళీధర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, ప్రముఖ శాస్త్రవేత్త రవీంద్రనాథ్, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ సహదేవుడు, అన్నెం శ్రీనివాసరెడ్డి, నరేంద్ర మరియు పలువురు తెలుగు పండితులు, పుర ప్రముఖులు అభినందనలు తెలిపారు.

6
246 views