logo

సేవే మార్గంగా నిలిచిన నమ్మి సతీష్ జన్మదిన వేడుకలు.....

విశాఖపట్నం (గాజువాక)

89 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన నమ్మి సతీష్ కి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్,జనసేన పార్టీ 64 వార్డ్ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ దల్లి గోవిందరెడ్డి,సీతానగరం ప్రెసిడెంట్ నంబారు సింహాద్రి,నమ్మి బాబురావు(యోగ మాస్టర్ ) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నమ్మి సతీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ మీడియాతో మాట్లాడుతూ 89 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం అన్నది అతి సాధారణ విషయం కాదు. ఎంతోమంది ప్రాణాలు కాపాడే విధంగా సంజీవిని వాలంటరీ బ్లడ్ సెంటర్ ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి సంజీవని లాగా ఉపయోగపడింది.ఈ యొక్క జన్మదిన వేడుకలు లో పాల్గొన్నందుకు ఆ భగవంతుని ఆశీస్సులు అలాగే ఎంతమంది అయితే సాయం పొందారు వారు ఆశీస్సులతో మరింత సేవా కార్యక్రమంలో చేసే విధంగా నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.

సీతానగరం ప్రెసిడెంట్ నంబారు సింహాద్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సాయం చేయడంలో మా తమ్ముడు నమ్మి సతీష్ ఎలలేని సేవలో రక్తదాన శిబిరం ద్వారా అందిస్తున్నారు.ప్రతి చిన్న అవసరాలకు రక్తం చాలా విలువైనదని రక్తం ఇచ్చిన దాతలు ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా నిలవడం. ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన సందర్భాలలో సంజీవిని వాలంటరీ బ్లడ్ సెంటర్ సంస్థ నుంచి ఎన్నో వేల కుటుంబాలకు బ్లడ్ డొనేట్ చేస్తూ ప్రజలలో మమేకమై చాలామంది ప్రాణాలు కాపాడడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా తెలిపారు.

నమ్మి బాబురావు (యోగ మాస్టర్) మీడియాతో మాట్లాడుతూ అతని ఆరోగ్య రహస్యానికి యోగ కూడా చాలా విధాలుగా సహకరించిందని అలాగే నిత్యం ప్రజా సేవలోనే ఉంటూ తన జీవన శైలిని కూడా ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా చూపించడం గర్వకారణం అని ఈ సందర్భంగా తెలిపారు.

నమ్మి సతీష్ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వలన సకాలంలో మా నాన్నకు బ్లడ్ సాయం అందలేక మరణించడం జరిగిందని.అప్పుడే నేనొక మంచి నిర్ణయానికి శ్రీకారం చుట్టాను.ప్రతి మనిషికి కూడా రక్తం చాలా అవసరమని ఆ రక్తాన్ని అందించే విధంగా తోటి మిత్రులతో కలిసి ఈ యొక్క సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేశానని తెలిపారు.ఇందుకు నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులు నా భార్యామణి బిందువుకు అలాగే నా సహోదరుడు నమ్మి అశోకు సహకారంతో ఈ బ్లడ్ బ్యాంక్ ని నడుపుతున్నాను.ప్రజల దగ్గర నుంచి తీసుకున్న రక్తమును ఎవరికైతే అవసరమో వారికి అందించే విధంగా నిస్వార్ధంగా నేను ప్రజలకు సహాయపడే విధంగా నా ప్రయత్నం ఎప్పుడూ కూడా ఆగకుండా నడుపుతానని తెలిపారు. ప్రజలను ప్రాణాలను కాపాడే విధంగా నా సేవా కార్యక్రమం ఆపనని తెలిపారు.ఇప్పటికీ 89 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను ఇంకా నా మైలురాయికి 11 సార్లు మాత్రమే ఉన్నది ఆ యొక్క భగవంతుని ఆశీస్సులతో మరికొంతమంది ప్రజలను కాపాడే ఉద్దేశంతో ముందుకు వెళతానని ఈ సందర్భంగా తెలిపారు.ఈ యొక్క రక్తదాన శిబిరంలో తోటి మిత్రులకు అలాగే నా వెన్నుండి నడిపించే నా భార్యామణి బిందువుకు అలాగే నా అన్న నమ్మి అశోక్ ఇతర సోదరీ సమానులైన బంధు,మిత్రులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంజీవిని వాలంటరీ బ్లడ్ సెంటర్ సంఘ సభ్యులు,జనసేన పార్టీ కార్యకర్తలు,మిత్రులు,శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

10
486 views