logo

అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ సేవలు మరువలేనివి..


ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ సేవలు మరువలేనివి*
: అహుడ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మకి ఘన సన్మానంనగరంలోని అహుడ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మకి మంగళవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహుడ చైర్మన్ టి.సి.వరుణ్, అహుడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, అహుడ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అహుడ చైర్మన్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ బదిలీపై వెళ్లడం ఊహించలేదని, ఇంఛార్జి జిల్లా కలెక్టర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన సేవలు మరువలేనివన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇంఛార్జి జిల్లా కలెక్టర్ తో కలిసిమెలిసి పనిచేయడం జరిగిందని, ఇది తాను జీవితాంతం గుర్తించుకునే విషయమన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ ముందు వరుసలో ఉంటారని, అహుడ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని, రాష్ట్రస్థాయిలో అహుడ ప్రధానంగా ఎదిగిందన్నారు. అహుడకి మంచి ల్యాండ్ బ్యాంక్ వచ్చేలా చర్యలు తీసుకున్నారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.*
ఈ సందర్భంగా ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ తాను అహుడ వైస్ చైర్మన్ గా పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆ సమయంలో అధికారులు, సిబ్బంది అందరూ మంచిగా సహకారం అందించారని ఇందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంతకుముందు చాలా తక్కువ టీంతో అహుడ ఉందని, ఐదారు నెలల కిందట కొత్తగా అధికారులు, సిబ్బంది వచ్చారని, ఛైర్మన్, సెక్రెటరీ, అందరూ తనకు చాలా చక్కగా సహకారం అందించారన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ కష్టపడి పనిచేయడం కొనసాగించాలని సూచించారు. అహుడలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.*
ఈ సందర్భంగా అహుడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అహుడలో వైస్ చైర్మన్ గా శివ్ నారాయణ్ శర్మ గారు బాధ్యతలు స్వీకరించిన వాటి నుంచి పరిపాలన, రెవెన్యూ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడ నూతనంగా సిబ్బందిని నియమించారని, బిల్స్, స్టాఫ్ అరియర్స్ పరిష్కారం చేశారని, అహుడకి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, జిల్లాలో రాష్ట్రంలోనే లేనివిధంగా ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు మంచి పేరు వచ్చిందని, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మకి శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి ఛైర్మన్, సెక్రెటరీ, అధికారులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అహుడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, డీఈ రేవంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, కేఎండి.ఇషాక్, ఎగ్జిక్యూట్ ఇంజినీర్ దుష్యంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.*

0
66 views