logo

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు...శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం..



మారమ్మ జాతర సందర్భంగా డ్రోన్‌తో ప్రత్యేక నిఘా...
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు...శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం..

బుక్కపట్నం మండలంలోని నారసింపల్లి మరియు నారసింపల్లి తాండ గ్రామాలలో మంగళవారం జరిగిన మారమ్మ జాతర సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశాలతో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు తదితర సున్నిత ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయబడింది.
జాతర సమయంలో గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ సజావుగా సాగడం, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ డ్రోన్ నిఘాను ఉపయోగించారు.
పుట్టపర్తి రూరల్ సిఐ సురేష్, ఎస్సైలు సిబ్బందితో ప్రత్యేక పోలీస్ బందోబస్తు, మహిళా పోలీస్ సిబ్బంది, మోహరించారు.
“ప్రజలు భక్తిశ్రద్ధలతో జాతరను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. పోలీస్ శాఖ అన్ని విధాలా భద్రత కల్పిస్తోంది. ఏవైనా అనుమానాస్పద అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ సురేష్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ ఆధునిక నిఘా ఏర్పాట్లకు ప్రజలు సహకరించి, మారమ్మ జాతరను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని కోరారు.

0
281 views