logo

డోన్ రైల్వే స్టేషన్లో రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ కు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి వినతి పత్రం


డోన్ రైల్వే స్టేషన్లో రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ కు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి వినతి పత్రం అందించారు*
డోన్ పట్టణం:- వృద్ధులకు కరోనా ముందు గతంలో రాయితీ ఉండేది ప్రస్తుతం లేదు దాన్ని పునరుద్దించాలని వేడుకుంటున్నాము. అన్ని ఫ్లాట్ ఫారంలలో గ్రానైట్ బండలు పరిచారు కొన్ని నీళ్ళు పడిన వర్షం పడిన ప్రయాణికులు జారి పడతారు. కావున అవి జారకుండా రఫ్ చేయించాలని కోరారు. అన్ని రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్స్ మరియు ఆహారం కొన్ని సార్లు అధిక రేట్లకు అమ్ముతున్నారు. వాటిని నియంత్రించాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి వేడుకుంటున్నారు. బేతంచర్ల లో కరోనా ముందు ఎక్స్ ప్రెస్ రైలు ఆగేవి ఆ తర్వాత ఆపడం లేదు కావున మళ్లీ ఆగేవిధంగా చేయించాలి. తుంగభద్ర రైలు డోన్ దాకా వచ్చేటట్టు చేయించాలి. నంద్యాల మీదుగా విజయవాడకు పోవడానికి రైళ్ళు ఎక్కువ వేయించాలి. డోన్ రైల్వేస్టేషన్లో లిఫ్టు ఎక్స్లెటర్లు వేయించాలని వందే భారత రైలు డోన్లో ఆపే విధంగా చేయించాలి. డెమో రైల్లో బాత్రూంలు కల్పించాలి. డోన్ రైల్వేస్టేషన్లో గుంటూరు పోవడానికి నాలుగో ఫ్లాట్ ఫారం నుంచి బయలుదేరుతుంది. అక్కడికి పోవడానికి ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది కావున ఒకటి లేదా రెండు ఫ్లాట్ఫారంలో బయలుదేరే విధంగా ఏర్పాటు చేయించాలని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి కోరారు. డోన్ ఏ యన్ బంగ్లా బ్యాక్ సైడ్ మరియు అమ్మ హోటల్ ఏరియాలో రైల్వే స్టేషన్ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఎక్స్ప్రెస్ రైల్వే జనరల్ బోగీలను కొన్ని ఎక్కువగా ఏర్పాటు చేయించే విధంగా చేయించాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ కు ప్రజా సమస్యల అర్జీ ఇచ్చారు.

0
25 views