logo

భారత సేవ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా వాసి మృతదేహం నేడు స్వదేశానికి.



(చంద్ర న్యూస్:- విదేశాంగ ప్రతినిధి, దుబాయ్ జనవరి 19).


కామారెడ్డి జిల్లా: మాచారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన గొపు రాములు పోట్ట చేత పట్టుకొని గల్ఫ్ దుబాయ్ కి వచ్చిన రెండు నెలలకె మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే రాములు కంపెనీలో కార్మికుడు గా వచ్చారు, బాత్రూంలో కాలుజారి అపస్మారక స్థితిలో వెళ్లి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కంపెనీ మృతదేహాన్ని అతని స్వగృహము (ఒక మనిషిని ) రామ స్వామి ఇచ్చి పంపించారు.భారత సేవా సమితి తమ వంతు సహాయంగా కంపెనీతో ఇండియన్ అంబాసి తో సంప్రదింపులు చేసి గొపు రాములు పార్థివ దేహాన్ని ఇంటికి తరలించేందుకు హైదరాబాదు ఏర్ పోర్ట్ నుండి అంబులెన్స్ సౌకర్యం కల్పించడంలో తోడ్పడటం జరిగింది. ఇక్కడ అతని మిత్రులు గ్రామస్థులు గొపు రమేష్, గొపు సంతోష్, ముదమ్ రమేష్ , చిట్టి సంతోష్ గొపు నవీన్, మొగ్గం రమేష్ , నవీన్ కామారెడ్డి, కొత్తింటి గణేష్, కుమ్మరి రాజేందర్ ఆసుపత్రి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి వారి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత సేవ సమితి దుబాయ్, (సామాజిక కార్యకర్త )బొమ్మ ప్రవీణ్, జంగం బాలకిషన్, పొన్నం సత్యం, రమేష్ పవర్, శ్రీకాంత్ వేణుగొపాల్ భోగ. ప్రగాఢ సంతాపాన్నివ్యక్తం చేశారు. సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.

23
1368 views