logo

జర్నలిస్టుల పాలిట ఆపద్బాంధవుడు..'నగరంలో నేడు'గ్రూప్ అడ్మిన్ ఎం.ఎస్.ఆర్.ఆర్. ప్రసాద్....

విశాఖపట్నం

ఆపదలో ఉన్న మీడియా మిత్రులకు ఆర్థిక బాసట

తోటి జర్నలిస్ట్ యుగంధర్‌కు అండగా నిలిచిన గ్రూప్ సభ్యులు

మీడియా ఐక్యతను చాటుతున్న 'నగరంలో నేడు'వాట్సాప్ వేదిక


విశాఖ నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా జరిగే ప్రతి చిన్న విషయాన్ని, వార్తా విశేషాలను క్షణాల్లో మీడియా మిత్రులకు చేరవేస్తూ 'నగరంలో నేడు' వాట్సాప్ గ్రూప్ కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఈ గ్రూప్ కేవలం వార్తలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్న జర్నలిస్టులను ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి గ్రూప్ అడ్మిన్, వి డిజిటల్( V DIGITAL ) ఛానల్ బ్యూరో ఎం.ఎస్.ఆర్.ఆర్. ప్రసాద్ సారథ్యం వహిస్తుండటం విశేషం.విశాఖ నగరంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా 'మినిట్ టు మినిట్' సమాచారాన్ని అందించడంలో ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ ఎప్పుడూ ముందుంటారు. జిల్లా లో మీడియా సోదరులెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా,ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. కష్టకాలంలో బంధువులు, ప్రభుత్వం ఆదుకుంటారో లేదో తెలియదు కానీ, 'నగరంలో నేడు' గ్రూప్ ద్వారా ప్రసాద్ మాత్రం ముందుండి ఆదుకుంటున్నారని తన వంతు సహాయంగా తోటి జర్నలిస్ట్ మిత్రుడు ఎస్.యుగంధర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో (Lung Infection) తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆపరేషన్ నిమిత్తం ఇప్పటికే ఆరు లక్ష్మలు ఖర్చు చేసిన వారి కుటుంబ సభ్యులకు మరొక లక్షల యాభై వేల రూపాయలు ఇంకా అదనపు ఖర్చు అవుతుండటంతో,కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించారు.ఈ విషయాన్ని గమనించిన ఎం.ఎస్.ఆర్.ఆర్. ప్రసాద్ వెంటనే స్పందించి, వారి వివరాలను, ఫోన్ పే నెంబర్లను గ్రూపులో పోస్ట్ చేశారు.
దీంతో గ్రూపులో ఉన్న మీడియా మిత్రులు, రాజకీయ ప్రముఖులు, దాతలు తక్షణమే స్పందించారు.ఎవరికి తోచినంత వారు ఆర్థిక సహాయం చేస్తూ,యుగంధర్ కుటుంబానికి అండగా నిలిచారు.అవసరానికి తగ్గట్టుగా సహాయం అందుతుండటంతో బాధితుని కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఎం.ఎస్.ఆర్.ఆర్. ప్రసాద్ అలాగే పిలుపునివ్వగానే స్పందించి సహాయం చేసిన ప్రతి ఒక్క మీడియా సోదరునికి, రాజకీయ నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఇప్పటిదాకా గ్రూపు సభ్యులందరూ కలిసి సుమారుగా 70 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని ఈ యొక్క సహకారం తోటి పాత్రికేయ మిత్రులు సహకారంతోనే జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.

1
188 views