19/01/2026
డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.86.93 లక్షల వడ్డీలేని రుణాల పంపిణీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.86.93 లక్షల విలువైన వడ్డీలేని రుణాల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని,మహిళలు స్వయం ఉపాధి మార్గాల్లో ముందుకు సాగేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్