
మర్రి నరేష్ ప్రధాన వార్త: అక్రమ వాసులు దందా రాయికల్ మండల ప్రెస్ క్లబ్ పేరిట...?
మీడియా అనేది ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేయాలి వ్యక్తిగత స్వార్థం కోసం కలం పట్టినోడు మీడియా ప్రతినిధి ఎలా అవుతాడు మీడియా ప్రధాన లక్ష్యం సామాన్య ప్రజల సమస్యను సమాజంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే దిశగా అడుగులెయ్యాలి కానీ దీనికి విభిన్న రీతిలో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండల వార్త విలేకరులు ప్రవర్తిస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి సమాచారం
రాయికల్ మండల ప్రెస్ క్లబ్ లోని కొందరు మొదట వీరుప్రజాప్రతినిధులను మీ గ్రామంలో అవినీతి జరుగుతుంది మీరు అవినీతి చేస్తున్నారంటూ మాకు పేపర్లో పేపర్ యాడ్ టార్గెట్ ఉందంటూ మీరు మాకు యాడ్ కు డబ్బులు ఇవ్వకపోతే మీపై వార్త పెడతామంటూ బెదిరింపుల పాలు చేసి డబ్బులు గుంజుతారు ఇది ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారంటే వారి పైన ఉన్న ఇన్చార్జిలకు కూడా తెలియకుండా కథంతా సాఫీగా నడిపిస్తారు మరోవైపు చట్టాల పైన అవగాహన కల్పించాల్సిన మీడియా అవగాహన కల్పించకుండా గ్రామాలలో ఏం జరిగినా గ్రామ అభివృద్ధి పేరిట టెండర్లు నిర్వహించుకుంటే ఇది అక్రమమని మొదట ప్రెస్ క్లబ్ పేరట కొంత డబ్బులు రా గుంజుతారు ఆ తర్వాత మళ్లీ అదే ప్రెస్ క్లబ్ లోని ఒక వ్యక్తి తోని వార్తలు రాపిచ్చి సంబంధిత అధికారులతో కుమ్మక్కై అధికారుల చేత కాల్స్ చేపిస్తూ అధికారులు మీడియా ప్రతినిధులుగా చెలామన అయ్యే వీళ్ళు డబ్బులు రా గుంజే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా జగిత్యాల జిల్లా డిపిఆర్ఓ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రాయికల్ ప్రెస్ క్లబ్ చేసే దోపిడీ వెనక ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసే రాయికల్ ప్రెస్ క్లబ్ పైన ఈ ప్రెస్ క్లబ్ కు సహకరించే అధికారుల పైన సమగ్ర విచారణ జరిపి ఇటు బాధితులకు అటు సమాజానికి న్యాయం జరిగేలా చూడాలని సమాజం మేధావులు కోరుకుంటున్నారు ఇక రాయికల్ ప్రెస్ క్లబ్ పైన జిల్లా స్థాయి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి