Bhainsa car accident
AIMA NewsHomeక్రైమ్బిగ్ బ్రేకింగ్ న్యూస్ భైంసా సుద్దవాగు వంతెనపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదంక్రైమ్తెలంగాణబిగ్ బ్రేకింగ్ న్యూస్ భైంసా సుద్దవాగు వంతెనపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదంAIMA NewsJanuary 20, 20260* ట్రాలీ లారీ- ఏరిటికా వాహనం ఢీ కొట్టుకోవడంతో దుర్ఘటన* ప్రమాద స్థలిలోనే నలుగురి దుర్మరణం* మృతుల్లో ముగ్గురు కుష్టివాసులు* ప్రాణాపాయ స్థితిలో గ్రామ సర్పంచ్ గంగాధర్– నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు– హైదరాబాదు పరామర్శకు వెళ్లి తిరిగివస్తుండగా ఘటనభైంసా (ఎయిమ్ న్యూస్) : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సుద్దవాగు వంతెనపై సోమవారం అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెలుతున్న పరిశ్రమల నిర్వాహణలో వినియోగించే బారీ పరికరాన్ని తీసుకవెలుతున్న ట్రాలీ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసాలోనికి వస్తున్న ఏరిటిక వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఘటనలో ఎరిటిక వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రమాద స్థలిలోనే దు త్వరణం పాలయ్యారు. మరొకరు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇద్దరు బాధితులు సిందే ఆనందవ్, లక్ష్మణు తెలిపిన కథనం ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుభీర్ మండలం లోని కుప్టి సర్పంచు గంగాదర్ తో పాటు మరో ఐదుగురు గ్రామస్తులు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న గ్రామస్తుడిని పరామర్శించేందు వెళ్లారు. సోమవారం ఉదయం వెళ్లిన వీరందరూ రాత్రి పూట తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్ర యాణిస్తున్న ఏరిటిక వాహనం మరో రెండు నిముషాల వ్యవధిలో బైంసాకు చేరుకునే సమయంలో ప్రమాదాని గురైంది. సుద్దవాగు వంతెనపై ఎదురెదురుగా వస్తున్న ట్రాలీ లారీ ఏరిటికా వాహనం ఢీకొట్టుకున్నాయి ఘటనలో ట్రాలీ లారీపై నున్న భారీ పరికరానికి తగిలిన ఏరిటిక వాహనం కుడి వైపు భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది. దీంతో కుబీర్ మండల కేంద్రానికి చెందిన ఏరిటికా వాహన డ్రైవర్ వికాస్ బొప్ప, మద్య సీట్ కుడి భాగంలో కూర్చున్న భోజరామ్ పా టిల్ వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు కొడిమెల పెద్ద రాజన్న, బోయిడి బాబన్నఘటన స్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. ఇక మధ్య సీట్ మధ్య భాగంలో కూర్చున్న గ్రామ సర్పంచు గంగాధర్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్షతగాత్రుడిని భైంసాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న బైంసా ఏఎస్సీ రాజేష్ మీనా, సీఐ సాయి కుమార్ లు ఘటన స్థలికి చేరుకొని ఏరిటిక వాహనంలో చిక్కుకొని మృతి చెంది కొడిమెల పెద్ద రాజన్న, బోయిడి బాబన్నల మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీయించారు. అయితే తీవ్రమైన ప్రమా దం కారణంగా బోయిడి బాబన్న శరీరం నుంచి తల బాగం తెగిపోయి వాహనం నుంచి బయట పడిపోయింది. ఇక డ్రైవింగ్ సీట్ నుంచి కింది బాగంలో పడిపోయిన డ్రైవర్ వికాస్ బొప్ప, డోరు ఊడిపోయి రోడ్డుపై పడిపోయిన బోజరామ్ పాటిల్ మృతదేహాలను ట్రాలీ ఆటోలో పోస్టు మార్గం నిమిత్తం ఇక్కడి ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డుపైనున్న రెండు వాహనాలను జేసీబీ ద్వారా తొలగించారు.ఎయిమ్ న్యూస్ రిపోర్డ్ బై ఆడే జగదీష్ ఆదిలాబాద్