logo

అసత్య కథనాలు ప్రచార పై ఉక్కుపాదం... పేక్షించేది లేదనీ స్పష్టం. ఎస్సై మధు సుదన్.

నంద్యాల జిల్లా శిరివెళ్ల ఎస్సై మధుసూదన్ అసత్య కథనాలు ప్రచారం పై ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వాస్తవ సంఘటనలను తెలుసుకోకుండా నిర్ధారణకు రాకుండా అసత్య కథనాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే తాట తీస్తానని ఎస్సై మధుసూదన్ ఘాటుగా హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం విలేకరులతో
మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా గోరంతను కొండంతగా చేస్తూ ఫేక్ ప్రచారాన్ని విస్తృతం చేసేవారిని ప్రత్యేకంగా గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోసాలు సైబర్ నేరాల పట్ల శిరివెళ్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బంగారు వెండి ఆభరణాలకు మెరుగు పెడతామంటూ వచ్చేవారి మాటలు నమ్మి మోసపోకుండా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా మట్కా పేకాట ఇతర జూదాలు శిరివెళ్ల మండల వ్యాప్తంగా ఎక్కడైనా నిర్వహిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోక్యంగా ఉంచుతామన్నారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణకు నిరంతరం నిగా ఉంటుందని ఎస్సై మధు సుదన్ తెలిపారు.

32
1398 views