
ఎస్ టి యూ ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి బుల్లెట్ మెటీరియల్.....
ఎనఫ్ జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు ఈరోజు జరిగిన ఎస్ టి యు ఆంధ్రప్రదేశ్ వారిచే తయారు చేయబడిన 10వ తరగతి బుల్లెట్ మెటీరియల్ ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది హై స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న సుమారు 57 మంది విద్యార్థులందరికీ ఉచితంగా ఈ ఎస్ టి యు పదవ తరగతి బుల్లెట్ మెటీరియల్ ని పంపిణీ చేయడం జరిగినది దుగ్గిరాల మండల ఎస్ టి యు అధ్యక్షుడు ఉన్నం ప్రసాద్ మాట్లాడుతూ గత సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సుమారుగా 75 కంటే ఎక్కువ మార్కులు ఈ మెటీరియల్ వల్ల విద్యార్థులందరూ సాధించారని ఈ మెటీరియల్ లోని ప్రశ్నలు సమాధానాలు నిపుణులచే తయారు చేయబడినవని అందరూ సద్వినియోగం చేసుకొని టెన్త్ క్లాసు 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు అదేవిధంగా దాదాపు 3,500 రూపాయల మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉపాధ్యాయులందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి దుగ్గిరాలను పదవ తరగతి ఉత్తీర్ణతలో ముందు ఉంచాలని కోరారు. విద్యార్థులందరూ చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా సత్ప్రవర్తన కలిగి మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశీర్వదించారు... ఎనఫ్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి జయరత్నవాణి గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులందరికీ ఉచిత మెటీరియల్ ని అందించిన తాడిబోయిన రామస్వామి యాదవ్ గారికి మరియు తమ పాఠశాలకి ఉచితంగా పుస్తకాలు అందించడంలో తోడ్పడిన రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీధర్ గారికి ఎస్టియు సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు... ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీధర్ గారు మాట్లాడుతూ విద్యార్థులందరి ప్రగతి సాధించడానికి మంచి ఉత్తీర్ణతతో భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతోనే ఈ మెటీరియల్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందని అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
కార్యక్రమంలో ఎస్టియు దుగ్గిరాల మండల అధ్యక్షుడు ఉన్నం ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నాగేశ్వరరావు , రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీధర్ జిల్లా సభ్యులు బి మరియదాసు బి బ్రహ్మయ్య ఏ రాంబాబు, మరియు ఎస్కే బాజీ ,చింకా సురేషు, తాడిబోయిన శ్రీధర్ బాబు, కుర్ర నాగయ్య ,ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ గారు మరియు ఎన్ ఎఫ్ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు