logo

ఎస్బిఐ కాలనీ సర్వేనెం 2299 ను ఎర్ర నక్షత్ర మార్కు కబందాల నుండి రక్షించండి.

నంద్యాల (ప్రజా పక్షం): ఎస్బిఐ కాలనీ లో వందల సంవత్సరాలుగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా సర్వేనెం. 2299లో ప్రజలు నివాస గృహాలు మున్సిపాలిటీ అనుమతి తీసుకొని, బ్యాంకు ఋణాలు తీసుకొని నిర్మించుకొని, పన్నులు చెల్లిస్తు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ పరంగా రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కలిగి ఉన్నారు. కాని హటాత్తుగా రాజకీయ లబ్ది కోసం ,2019లో ఏకపక్షంగా ఒక్క కలం పోటుతో సర్వేనెం 2299 కు అనుబంధంగా ఉన్న నివాస గృహ సముదాయాలను ఎర్ర నక్షత్ర స్థాయిలో ఇనాం భూములుగా ప్రకటించారు. అప్పటి నుండి ప్రజలు పిల్లలు చదువులకు, పెండ్లీలకు స్థలాలు అమ్ముకోలేక, సతమతం అవుతూ ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మెమోరాండాలు సమర్పించిన ఎవరికి కనికరం రాలేదు. ఎట్టకేలకు జీఒ ఎంఎస్ నెం 310 ప్రకారం అలాంటు భూములు పై ఆంక్షలు తొలగించాలని 26.07.2023 లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయిన దానిమీద ఎందుకో ఏ అధికారి, ఏ ప్రజా ప్రతి నిధి స్పందించ లేదు. ప్రజలు కలెక్టర్ దృష్టికి ఈ సమస్య తీసుకొని పోతు ఇంచుమించుగా నేడు యాభై మంది ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీ దాఖలు చేసినట్లు, గత వారంలో సైతం అనేక మంది స్వంత డాక్యుమెంట్లు జత చేసి అర్జీలు సమర్పించినట్లు కాలనీవాసి, మైనార్టీ నాయకులు అబ్దుల్ సమద్ తెలిపారు. స్థానిక మంత్రివర్యులు ఈ సమస్య పై స్పందించాలని, అధికారులు సంబంధిత ప్రభుత్వం ఉత్తర్వులు, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 22ఎ(1)సి, 1908 ప్రకారం ఎర్ర నక్షత్రం తొలగించాలని ఎస్బీఐ కాని వాసులను కనికరించాలని కోరుతున్నారు. ఈ సమావేశంలో ఆడిటర్ ఎస్బి బాషా, రేడియో బాషా, బాండ్స్ ఖాదర్ భాషా పాల్గొన్నారు.

4
58 views