రెడ్డి సోదరుల కళ్యాణ మండప నిర్మాణానికి 60 లక్షల రూపాయలు. ఎంపీ
పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో ప్రజా కవి యోగివేమన విగ్రహావిష్కరణ
పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారధి గారు మరియు కుమారుడు యువ నాయకుడు బి కే సాయి కళ్యాణ్ గారు అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ 13వ శతాబ్దంలోని తన సాహిత్యాలతో అనేక విప్లవాలకు నాంది పలికిన మహనీయుడు యోగి వేమన, అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యోగివేమన జయంతిని అధికారికంగా ప్రకటించి నిర్వహించడం జరిగింది, అటువంటి మహనీయుని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను ఇక్కడకు నన్ను ఆహ్వానించిన రెడ్డి సోదరులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రెడ్డి సోదరుల కోరిక మేరకు 60 లక్షల రూపాయలు కళ్యాణమంటపానికి ప్రకటిస్తున్నాను అని తెలియజేశారు అనంతరం పార్లమెంటు సభ్యులకు రెడ్డి సోదరులు కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో యోగి వేమారెడ్డి సంఘం నాయకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు....