logo

ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంగా పశు ఆరోగ్య శిబిరాలు గొల్లలపాలెంలో ప్రారంభం


అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం గొల్లల పాలెంలో ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జనవరి 31 వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పశుపోషక రైతుల సంక్షేమాన్ని కాపాడేందుకు .డా.నూకేష్, డా.దమయంతి, సర్పంచ్ విసరపు రమణాజీలు ఈ శిబిరాలను ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం దిబ్బలపాలెం, ఆర్ల గ్రామాల్లో రెండు బృందాలుగా వెటర్నరీ సిబ్బంది సుమారు 197 పశువులకు మందులు, చికిత్సలు అందించారు . శిబిరాల్లో పశువులకు వైద్య చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు, ఎద మందులు, గర్భకోశ వ్యాధుల చికిత్స, కృత్రిమ గర్భధారణ సేవలు, శాస్త్రీయ పశుపోషణ అవగాహనలు పూర్తిగా ఉచితంగా అందిస్తారు . రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.పశువైద్య అధికారులు మాట్లాడుతూ, ఈ శిబిరాలు రాష్ట్రంలోని 13 వేలకు పైగా గ్రామాల్లో ప్రతి మండలానికి రెండు బృందాలతో జరుగుతాయని తెలిపారు . పాడి ఆవులు, గొర్రెలు, మేకలు, లేగ దూడలు, కోళ్లకు కూడా ప్రత్యేక చికిత్సలు అందుతాయి అన్నారు. పశువుల్లో సాధారణ వ్యాధులను నియంత్రించి, ఉత్పాదకత పెంచే ఈ కార్యక్రమంలో పత్రికాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అభ్యుదయ రైతులు సహకరించాలని అధికారులు కోరారు . ఈ నెలాఖరు వరకు మారుమూల గ్రామాల్లో ఈ శిబిరాలు కొనసాగుతాయి అని ఈ సందర్భంగా తెలిపారు.

0
609 views