logo

ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

AIMA న్యూస్. నంద్యాల జిల్లా.
ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలో సోమవారం రోజున అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పారువేట తిరుణాల సందర్భంగా కోట కందుకూరు యూత్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులు బ్లడ్ అచ్చు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ రక్తదానం అనేది మహత్తరమైన సేవ ముఖ్యంగా యువకులు రక్తదానం చేయాలి ఒక యూనిట్ రక్తం ద్వారా మూడు ప్రాణాలు కాపాడవచ్చు సామాజిక బాధ్యతగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లడ్ అచ్చు మాట్లాడుతూ రక్తం కొరత వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రక్తదాన శిబిరంలో 23 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. సేకరించిన రక్తాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

24
1010 views