
యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
*ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు..*
- *: యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓలు, ఆయా శాఖల జిల్లా అధికారులు..*
- *అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణరెడ్డి, ఆర్డీఓలు కేశవనాయుడు, ఏబీవీఎస్బి శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జున, జిల్లా సైనిక్ సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప, హౌసింగ్ పిడి శైలజ, డిఆర్డీఏ పిడి శైలజ, డిసిఓ అరుణకుమారి, ఆన్ సెట్ మేనేజర్ శ్రీనివాసులు, డిఎండబ్ల్యుఓ రామసుబ్బారెడ్డి, పర్యాటక శాఖ అధికారులు దీపక్, అయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.*
ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధమైన తత్త్వకవి అని అన్నారు. ఆయన 17వ శతాబ్దానికి చెందినవాడిగా భావిస్తారని, సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో లోతైన తాత్విక భావాలను చెప్పిన గొప్ప కవి యోగి వేమన అని పేర్కొన్నారు. మొదట ఆయన సాధారణ జీవితాన్ని గడిపినా, ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించిన తర్వాత యోగిగా మారారని, కులభేదం, మూడనమ్మకాలు, ఆడంబరాలు, అజ్ఞానం వంటి వాటిని ఆయన తీవ్రంగా విమర్శించారన్నారు. వేమన రాసిన పద్యాలు ఎక్కువగా వేమన శతకముగా ప్రసిద్ధి చెందాయని, ఈ పద్యాలు నైతిక విలువలు, సమానత్వం, సత్యం, ఆత్మజ్ఞానం, మానవత్వం వంటి అంశాలను ప్రబోధిస్తాయని, ఆయన చెప్పిన బోధనలు నేటికీ ప్రజల్లో మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. సరళమైన భాష, సామాజిక సంస్కరణలపై దృష్టి,, ఆధ్యాత్మిక తత్త్వబోత, ప్రజల జీవితాలకు అన్వయించుకునే సందేశం వేమన కవిత్వం యొక్క ముఖ్యలక్షణం అన్నారు. యోగి వేమన తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారని, ఆయన పద్యాలు కాలాతీతంగా నేటికీ సత్యం, ధర్మం, జ్ఞానం గురించి మనకు బోధిస్తున్నాయన్నారు. యోగి వేమన జయంతి తెలుగు సంస్కృతి మరియు సాహిత్యంలో ఒక విశిష్టమైనదిగా నిలిచిందన్నారు.*