logo

.85,500/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందచేసిన సావితమ్మ

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామములోని జి.అనితమ్మ ఇటీవల అనారోగ్యంతో బెంగళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకి తీసుకొని అనంతరం సి.యం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకోగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు .నారా చంద్రబాబు నాయుడు ద్వారా గౌరవ బీసీ మంత్రి వర్యులు సావితమ్మ నేడు బాధితులకు రూ.85,500/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందచేయడం జరిగినది.
ఈ సందర్భంగా బాధితురాలు అయిన జి.అనితమ్మ మాట్లాడుతూ"నాకు ఆర్థిక సహాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారికి,సవితమ్మ అక్క కి మరియు ఇందుకు నాకు సహకరించిన గౌరవ యన్.డి.ఏ కూటమి ప్రభుత్వానికి,నాయకులకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము" అని తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమములో సోమందేపల్లి మండల ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు సిద్ధలింగప్ప, చాకర్లపల్లి శ్రీరాములు,పందిపర్తి మాజీ ఎంపీటీసీ మరియు యూనిట్ క్లస్టర్ ఇంచార్జీ ఏ.మూర్తి,మైనారిటీ నాయకుడు బాబావలి మరియు తదితరులు పాల్గొన్నారు

2
89 views