టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ
ఆధ్వర్యంలో
క్రీడలతో మానసిక ఉల్లాసం
-జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య
-టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ
సిద్ధవటం జనవరి 18
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ అన్నారు.సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా ముగిశాయి.ఈ సందర్భంగా విజేతలకు వారు బహుమతులు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ..గ్రామ యువత క్రీడల్లో పాల్గొనడం ఆనందకరమని, ఇలాంటి క్రీడా పోటీలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడారంగంలో రాణించే యువతకు పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు.