logo

టిడిపి నాయకురాలు కోట సుబ్బమ్మ ఆధ్వర్యంలో సిద్ధవటంలో ఎన్టీఆర్ 30 వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించారు

*యుగపురుషుడు NTR కు సిద్ధవటంలో టిడిపి నాయకుల ఘన నివాళి*

రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు సిద్ధవటం మండలంలోని పరమాత్మ సేవా ఆశ్రమం నందు స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు పలువురు మాట్లాడుతూ 1949లో మనదేశం సినిమాతో చిన్న పాత్రలో మొదలుపెట్టి, పౌరాణిక బ్రహ్మ, తెలుగు ప్రజల పాలిటి సాక్షాత్తు దైవంగా భావించే యుగపురుషుడు, 300 లకు పైగా చిత్రాలలో నటించి, గొప్ప దర్శకుడిగా మరియు గొప్ప నిర్మాతగా సినీ రంగానికి ఎనలేని సేవలందించిన, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితుడు, తన 60 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే ప్రభంజనం సృష్టించి ఎమర్జెన్సీ వంటి ప్రజా పీడిత నిర్ణయాలు తీసుకున్న ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తెలుగు సాహితీవేత్త, తెలుగు భాషా ప్రియుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి పురస్కరించుకొని సిద్ధవటం మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని వారికి నివాళులర్పించి వారి స్ఫూర్తిని ప్రజల పట్ల అంకిత భావాన్ని సేవా నేరతిని కొనియాడారు.

వారి సినీ ప్రస్థానాన్ని స్మరిస్తూ మనదేశం చిత్రం లో చిన్న పాత్రతో ప్రారంభించి, కృష్ణుడిగా, రాముడిగా నటిస్తూ దైవత్వాన్ని పొంది, అనేక సాంఘిక చిత్రాలతో ప్రజలను మూఢ విశ్వాసాలను పోగొట్టి చైతన్యవంతులను చేస్తూ, మాస్ హీరోగా అప్పట్లోనే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి అనేక మైలురాళ్లను లెక్కలేకుండా అధిగమించిన వారి సినీ ప్రస్థానం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయం.

వారి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం సన్నగిల్లుతున్న సమయంలో 1982 వ సంవత్సరంలో ఒక శుభదినాన రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక పాత వాహనాన్ని చైతన్య రథం గా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి ప్రజలను ఉత్తేజపరుస్తూ కేవలం 9 నెలల కాలంలోనే 1983 ఎన్నికల్లో దేశ రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీని, వారి పాలకులను ఓడించి మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విప్లవాత్మక నిర్ణయాలను ఎన్నిటినో ప్రజలకు అందిస్తూ స్త్రీలకు తండ్రి ఆస్తిలో సగం వాటా ఇవ్వాలనే ఆస్తి హక్కు, ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంలో వెనుకబడిన తరగతుల (బిసి) వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్నికల పోటీలలో బీసీ రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవడం, తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని ఆయన నిరంతరం స్మరించే మాటను ప్రజలకు అందిస్తూ, ఆయన రూపొందించిన నేషనల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన విధానం తెలుగు ప్రజలు మరువరాని రాజకీయ ప్రస్థానం వంటి అనేక విషయాలను స్మరిస్తూ ఎన్టీఆర్ ఒక శక్తి అని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు ఎంతో సేవను అందించవలసిందిగా వారు పిలుపునిచ్చారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు విద్యాశాఖ ఐటి శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పాటిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని కల్పిస్తూ టిడిపి పార్టీని ఉన్నత శిఖరాలను తీసుకొని వెళ్తున్నారని ఇదేవిధంగా పార్టీ తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి మన్ననలు పొందుతూ పార్టీలకు అతీతంగా పేద బలహీన వర్గాల వారికి అండగా నిలవాలని పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా/దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు, సిద్ధవటం మండల సింగిల్ విండో చైర్మన్ దారపునేని దశరధ రామానాయుడు, నిత్య పూజ స్వామి దేవస్థానం చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్ యాదవ్, టిడిపి క్లస్టర్ కో కన్వీనర్ సిరిగిరెడ్డి శంకర్ రెడ్డి, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి వీరనాల రామచంద్ర, మాజీ మండల అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష, రాష్ట్ర బీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాడే శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపీపీ రామిరెడ్డి నరసింహారెడ్డి, మాచుపల్లి టిడిపి నాయకులు శేఖర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, మాజీ మండల కన్వీనర్ మామిడి సుబ్బారెడ్డి, నియోజకవర్గ మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ, టిడిపి మండల మహిళా అధ్యక్షురాలు కమల్ బి, మాధవరం యూనిట్ ఇన్చార్జి బషీర్ భాష, హరిప్రసాద్ టిడిపి గ్రామ కమిటీ కార్యదర్శి మురళి రాయల్, భాకరాపేట గ్రామ కమిటీ కార్యదర్శి కాడే రెడ్డయ్య తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

0
88 views