logo

చేపలు మాంసం విక్రయ దుకాణాల్లో తూకాల్లో మోసం చేస్తున్న 12 మంది దుకాణదారులపై కేసులు నమోదు

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**కొత్తగూడెం, అన్నపురెడ్డిపల్లి **జనవరి 18

చేపలు మాంసం విక్రయ దుకాణాల్లో తూకాల్లో మోసం చేస్తున్న 12 దుకాణదారులపై కేసులు నమోదు

*త్వరలోనే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న చికెన్, చేపల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేస్తాం,

*తూకాల్లో కొలతల్లో మోసం చేస్తున్న వారి వివరాలు నేరుగా తెలుపవచ్చు గోప్యంగా ఉంచుతాం తెలిపిన వారి వివరాలు,

*భద్రాద్రి జిల్లా తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్,

, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా, ఆదివారం తూనికలు కొలతలు శాఖ ఆధ్వర్యంలో ఆకస్మికంగా కొత్తగూడెం సంత ప్రాంతం, కొత్తగూడెం పట్టణం అన్నపూ రెడ్డిపల్లి మండలంలోని చేపలు, చికెన్, మాంసం విక్రయ దుకాణాలపై విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించడమైందని తూనికలు కొలతలు శాఖ అధికారి కే. మనోహర్ తెలిపారు. తనిఖీలలో తూనికలు కొలతల చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘిస్తూ ధృవీకరణ లేని తూకపు యంత్రాలు వినియోగించడం, తోకపు రాళ్ళల్లో మోసం. కాంటల్లో తేడాలు తదితర సరైన ముద్రలు లేకుండా తూకాలు నిర్వహించడం, కొలతల్లో తేడాలు చూపించడం వంటి అక్రమాలు జరిపిన దాడుల్లో గుర్తించబడినట్లు తెలిపారు. ఈ ఉల్లంఘనలపై మొత్తం 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

తూనికలు కొలతల చట్టాన్ని ఉల్లంఘించిన వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఆకస్మికంగా తనిఖీలు చేయటం జరుగుతుందని
వినియోగదారులను మోసగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అన్ని రకాల వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ ధృవీకరణ పొందిన తూకపు యంత్రాలనే వినియోగించాలని, దుకాణాలకు లైసెన్స్ కలిగి ఉండాలని నిర్ణీత కాలవ్యవధిలో పునఃధృవీకరణ చేయించుకోవాలని సూచించారు. వినియోగదారులు కూడా తూకాల్లో అక్రమాలు గమనించినట్లయితే జిల్లా తూనికలు కొలతలు శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయాల నికోరారు. భవిష్యత్తులో కూడా జిల్లాలోని సంతలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్ తెలిపారు.

203
7348 views