logo

వందేమాతరం పాడనన్న ఏఆర్ రెహమాన్- సమర్ధించిన సింగర్ చిన్మయి, బంగారం హీరోయిన్ మీరా చోప్రా- ప్రియాంక చోప్రాతో పోలుస్తూ!

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. గత ఎనిమిదేళ్లుగా హిందీలో తనకు అవకాశాలు తగ్గడానికి కారణం అక్కడ జరిగిన 'అధికార మార్పిడి' కావొచ్చని, అది కొంత మతపరమైన అంశం కూడా అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
రెహమాన్ దేశభక్తిని శంకించవద్దు

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తుండగా, రెహమాన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని పాత ఆరోపణలను సింగర్ చిన్మయి శ్రీపాద తోసిపుచ్చారు. ఓ జర్నలిస్ట్ ఎక్స్‌లో (ట్విట్టర్) స్పందిస్తూ.. గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను అరగంట పాటు బతిమిలాడిన రెహమాన్ 'వందేమాతరం' లేదా 'మా తుఝే సలామ్' పాడటానికి నిరాకరించారని, అది తనను చాలా బాధించిందని పేర్కొన్నారు.

దీనిపై సింగర్ చిన్మయి స్పందిస్తూ.. "గతేడాది నవంబర్ 23, 2025న పుణేలో జరిగిన ఆర్కే లక్ష్మణ్ మెమోరియల్ అవార్డ్ కాన్సర్ట్‌లో రెహమాన్ గారితో కలిసి మేమందరం వందేమాతరం పాడాము. అక్కడ ఉన్న వేలాది మంది జనం మాతో కలిసి గొంతు కలిపారు" అని గుర్తు చేశారు.

గొంతు సహకరించకపోయి ఉండొచ్చు

దాదాపు ప్రతి కాన్సర్ట్‌లోనూ ఆయన 'మా తుఝే సలామ్' పాడతారని, ఆ రోజు ఇంటర్వ్యూలో ఆయన గొంతు సహకరించకపోయి ఉండొచ్చు లేదా పాడాలనిపించి ఉండకపోవచ్చని, అంతమాత్రాన దానికి తప్పుడు అర్థాలు తీయడం సరికాదని చిన్మయి హితవు పలికారు.

ఈ చిన్న విషయాన్ని పట్టుకుని 'అందుకే ఆయన అలా చేశారు' అంటూ ముగింపులు పలకడం నేటి సమాజంలో ఉన్న విద్వేషపూరిత ధోరణికి అద్దం పడుతోందని సింగర్ చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియాంక చోప్రాతో పోల్చిన మీరా చోప్రా

రెహమాన్ సంగీతం అందించిన 'గాంధీ టాక్స్' చిత్రంలో నటిస్తున్న మీరా చోప్రా కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. తన కజిన్ సిస్టర్ ప్రియాంక చోప్రాతో రెహమాన్‌ను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"భారతదేశాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన వ్యక్తులు ఇద్దరే.. ఒకరు ప్రియాంక చోప్రా, మరొకరు ఏఆర్ రెహమాన్. ఆయన ఉద్దేశం అది కాకపోయినా, కావాలని ట్రోల్ చేయడం సిగ్గుచేటు. ఐకానిక్ 'వందేమాతరం' గీతాన్ని మనకు అందించిన ఆ లెజెండ్‌ను గౌరవించడం నేర్చుకోండి" అని పవన్ కల్యాణ్ బంగారం హీరోయిన్ మీరా చోప్రా పేర్కొన్నారు.

వివాదానికి కారణమైన వ్యాఖ్యలేంటి?

బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ముస్లిం మతానికి సంబంధించిన పదాలను సినిమాల్లో వాడే తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

7
303 views