
మర్రి నరేష్ నేటి ప్రధాన వార్త : కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారికి ఆర్థిక భరోసా
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి అనేక పథకాలను అమలు చేస్తోంది వీటిలో ముఖ్యంగా వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం, గృహ నిర్మాణం వంటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది ప్రధానంగా గ్రామీణ ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు ఆర్థిక భరోసా వ్యవసాయం పీఎం కిసాన్ చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి ₹6,000 అందిస్తారు ఇది మూడు విడతల్లో ₹2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు సాగు ఖర్చుల కోసం తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలను అందిస్తారు కేవలం పంటలకే కాకుండా పాడి పరిశ్రమ మత్స్య సాగుకు కూడా ఈ రుణాలు లభిస్తాయి అలాగే కేంద్ర ప్రభుత్వం
పెన్షన్ పథకాలు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు ₹3,000 పెన్షన్ లభించేలా కేంద్రం పథకాన్ని రూపొందించింది ఉపాధి హామీ పథకం క్రింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 100 రోజుల పని కల్పించేలా కార్మికులకు కనీస ఆదాయ మార్గంగా ఉపయోగపడాలి కానీ దీనిపై పూర్తి అవగాహన ప్రజల్లో లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పథకాలన్నీ అందేలా అవగాహన కల్పించకపోవడం సోషనీయాంసమని సీనియర్ బిజెపి నాయకులు చిలకమర్రి మదన్మోహన్ ఆల్ ఇండియా మీడియాకు తెలిపారు ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వీధి వ్యాపారం చేసుకునే వారికి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు లభిస్తాయి నివాసం మౌలిక వసతులు గ్రామీణ ఆవాస్ యోజన సొంత ఇల్లు లేని పేదలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది మైదాన ప్రాంతాల్లో 1.20 రూపాయలు కొండ ప్రాంతాల్లో 1.30 రూపాయల వరకు సాయం అందుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి అదనంగా 12,000 రూపాయలు ప్రజలకు లభించేలా కేంద్రం పథకాన్ని అమలు చేసింది అలాగే ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించడం దీని ప్రధాన ఉద్దేశం ఆరోగ్యం బీమా
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఏడాదికి ₹5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కల్పిస్తారు ఇటీవల 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు పోస్టాఫీసు ద్వారా గ్రామీణ ప్రజలకు తక్కువ ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం ద్వారా బీమా పొదుపు సౌకర్యాలను అందిస్తారు చాలా తక్కువ వార్షిక ప్రీమియంతో ప్రమాద జీవిత బీమా సౌకర్యం కల్పించింది ఇతర ప్రయోజనాల కింద గ్రామీణ మహిళలకు ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించారు గ్రామీణ ఉపాధి కల్పన పథకం కింద సొంతంగా చిన్న తరహా పరిశ్రమలు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు లభిస్తాయని ప్రజలందరూ పథకాలన్నింటినీ వాడుకోవాలని సీనియర్ న్యాయవాది చిలకమర్రి మదన్మోహన్ సీనియర్ బిజెపి నాయకులు ఆల్ ఇండియా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు