logo

ఎన్టీఆర్ ఆశయ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి


* రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ & స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
* సాలూరు మండలం శివరాంపురం గ్రామం, సాలూరు పట్టణం డీలక్స్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి సమర్పించారు.
* ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పేదలకు బట్టలు పంపిణీ చేశారు.
* సంక్షేమ ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని మంత్రి కొనియాడారు.
* 2 రూపాయలకు కిలో బియ్యంతో పేదల ఆకలి తీర్చిన మానవతా మూర్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
* ప్రతి ఒక్కరికీ పక్కా ఇంటి కలను సాకారం చేసిన మహానేత ఎన్టీఆర్ అని తెలిపారు.
* ఆస్తులలో వాటా ఇవ్వడమే కాక, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి అభ్యున్నతికి బాటలు వేసిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.
* ఆ మహనీయుని 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
* ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

15
88 views