logo

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సందర్బంగా ఘణ నివాళులు.

కొడిమ్యాల మండల కేంద్రం అంగడి బజార్ చౌరస్తా లో కొడిమ్యాల మండల తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు, కొడిమ్యాల గ్రామ ఉపసర్పంచ్ గుర్రం నర్సయ్య ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘణ నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం స్వీట్ల పంపిణి చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జెల కరుణాచారి, మండల బిసి సెల్ అధ్యక్షులు, కొడిమ్యాల గ్రామ 5 వవార్డు మెంబర్ రాపర్తి నర్సింగారావు, మండల బిసి సెల్ ప్రధానకార్యదర్శి దోపతి సత్యం, కొడిమ్యాల గ్రామ అధ్యక్షులు కట్టేకోల రాజేంద్రప్రసాద్, ప్రజలు, అభిమానులు అంకం జనార్దన్, గడ్డమీది గంగయ్య, కొండ అనిల్, వేములవాడ సతయ్య, వడ్లకొండ హన్మండ్లు, బోగ గణేష్, వేముల రవి, చెన్న దేవయ్య, సురేష్, సంపూనూరి ఆంజనేయులు, చిట్టిపెల్లి గణేష్, సతీష్, నరేష్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

19
1426 views