logo

" ఫోటోషూట్ " షూటింగ్ పూర్తి

విశాఖపట్నం తమ చిత్రం " ఫోటోషూట్ " షూటింగ్ పూర్తి చేశామని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి , 26 జనవరి 2026 న విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని , చిత్ర ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఆలూరి రమేష్ బాబు తెలిపారు . తమ రమేష్ & రాంప్రసాద్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న మొదటిచిత్రం ఈ చిత్రమని రెండో ప్రొడ్యూసర్ ఐన కుప్పిలి రాంప్రసాద్ తెలిపారు . చిత్ర దర్శకుడు గంగాధర్ ప్రసాద్ మాటాడుతూ ఈ చిత్రానికి మూలకథ కుప్పిలి రాంప్రసాద్ గారని , తాను కథ వినగానే ఇది ఒక మంచి సందేశాత్మక చిత్రం అవుతుందని నమ్మకం కలిగినది అని , తెలిపారు , ఈ చిత్రం లో రమేష్ బాబు , రాంప్రసాద్ గార్లు తో పాటు , ఇంకా హేమ వేంకటేశ్వరి , నూతన కథ నాయక కుమారి మాధవి , శ్రీనివాస్ గారు , భాస్కర్ , రవి , చిట్టిబాబు ఐ .వి . సుబ్బారావు గారు నటించారని తెలిపారు . ఈ చిత్రానికి సహాయ , సహకారాలు అందించిన యాపిల్ గెస్ట్ హౌస్ యాజమాన్యానికి , అలాగే జాన్సీ బోటిక్ యాజమాన్యానికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు . తాము మరో నాలుగు సందేశాత్మక చిత్రాలను నిర్మించ బోతున్నట్లు నిర్మాతలు తెలిపారు

27
1588 views