logo

కడప నగరంలో వైస్సార్ ప్రీమియర్ లీగ్

వైస్సార్ ప్రీమియర్ లీగ్

కడప జనవరి 18 :-SBNEWS9550

కడప నగరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్గనైజర్ లు అనిల్ కుమార్ రెడ్డి, ప్రదీప్ లు మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యం లో ప్రారంభించిన వైస్సార్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -1 లో విజేత కు 1లక్షరూపాయలు, రన్నరప్ కు 50 వేల రూపాయలు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు రవీంద్రానాథ్ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, కడప నగర యువజన అధ్యక్షుడు & విన్నర్ ప్రేజ్ మనీ దాత గుంటి నాగేంద్ర గారు క్రీడాకారులకు ప్రైజ్ మనీ ని బహుకరించి ట్రోఫీలను అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కడప నగర యువజన అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష , మేయర్ సురేష్ కుమార్,డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిని నాయకులను గజమాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్ లు బాలస్వామి రెడ్డి , రెడ్డి ప్రసాద్, మైనారిటీ నాయకులు అల్లబకాష్ , కడప నగర ప్రధాన కార్యదర్శి రెడ్డయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.

0
132 views