ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగ ప్రతిష్ఠాపన!
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఏకశిలా శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం బిహార్‌లోని విరాట్ రామాయణ్ మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం నితీశ్ కుమార్ హాజరవగా, వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహాబలిపురం (తమిళనాడు) కు చెందిన స్థపతులు పదేళ్ల పాటు శ్రమించి 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ మహా శివలింగాన్ని రూపొందించారు. ఈ శివలింగం రోడ్డు మార్గం ద్వారా సుమారు 2,100 కిలోమీటర్లు ప్రయాణించి బిహార్‌కు చేరుకోవడం విశేషంగా నిలిచింది.