అనారోగ్యంతో మరణించిన సచివాలయం ఉద్యోగికు నివాళులర్పించిన కడప సిటీ ప్రెసిడెంట్ గౌస్ పీర్
అనారోగ్యంతో మరణించిన సచివాలయం ఉద్యోగికు నివాళులర్పించిన కడప సిటీ ప్రెసిడెంట్.
కడప జనవరి 18 SBNEWS9550
కడప నగరం గౌస్ నగర్ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్న విజయ్ కుమారి అనారోగ్యముతో ఆకస్మికంగా మరణించినందుకు తీవ్ర దిగ్భ్రాంతికులోనై ఆమె పార్తివదేహాన్ని ఆదివారం సందర్శించిన కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షులు గౌస్ పీర్ నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనో ధైర్యాన్ని ఇస్తూ వారి కుటుంబ సభ్యులకు అండదండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆమె అనారోగ్యం వల్ల ఇబ్బంది పడు సమయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి, పోరాడి డ్యూటీలలో తగు వెసులుబాటు కల్పించి సహాయం చేసినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ, అకాల మరణానికి చాలా బాధపడుతున్నామని తెలిపారు. గౌస్ పీర్ మాట్లాడుతూఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు షామీర్ హుస్సేన్, జాబిర్ ఆలీ,సిద్ధిక్,గంగయ్య, అంజన్ కుమార్,సర్దార్ బాషా, సుబ్రహ్మణ్యం లు పాల్గొన్నారు.