
6 వేల మొక్కలతో నందన వనంలా మారుతున్న స్వర్గధామం: నిర్వాహకులు డాక్టర్ మధుసూదన రావు.
నంద్యాల జిల్లా (AIMA MEDIA): నంద్యాలలో స్థానిక పివి నగర్ సమీపంలో ఉన్న స్వర్గ ధామం స్మశానవాటికలో ఆదివారం నంద్యాల నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ సహకారంతో పూల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ ఈరోజు 500 పూల మొక్కలు నాటుతున్నామని దీనితో మొత్తం 6 వేల పూల మొక్కలతో స్వర్గధామం స్మశాన వాటికను నందనవనంలా మారుస్తున్నామని అన్నారు.నంద్యాల చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు స్వర్గధామం సేవలు అందిస్తున్నామని, వైకుంఠ రధాలు, ఫ్రీజర్ బాక్సులు, స్మశాన వాటికలో అంత్యక్రియల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. పి.వి.నగర్ వాసులకు మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత రెండుసార్లు స్వచ్ఛభారత్ అవార్డులు స్వర్గధామం స్మశాన వాటిక కు రావడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నవనిర్మాణ సమితి నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు, గెలివి రామకృష్ణ, శేషుబాబు, కశెట్టి కృష్ణమూర్తి, రావినూతల దుర్గాప్రసాద్, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ సుధాకర్, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ దిలీప్, దేవరశెట్టి శ్రీనివాసులు,వసుంధరా దేవి తదితరులు పాల్గొన్నారు.