logo

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా అమీర్ బాబు ఆధ్వర్యంలో అన్నదానం

అమీర్ బాబు ఆధ్వర్యంలో అన్నదానం

కడప జనవరి 18 SBNEWS9550

నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని జడ్పీ హాల్ పక్కన ఉన్న ప్రేమాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అమీర్ బాబు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆహారంలో ఎన్టీఆర్ కు ఏ ఫలాలు ఇష్టమో వాటిని పేదలకు అందించడం మరో విశేషం అమీర్ బాబు పేద మధ్యలో కూర్చొని సహబంతి భోజనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మి రాజకీయ ఫలాలు ప్రజలందరికీ అందాలని పార్టీని స్థాపించి ప్రజలకు మేలు చేశారని ఆయన తెలిపారు రాజకీయమంటే భూస్వాములు జమీందార్ల చేతుల్లోని రాజకీయవంత నడిచేదని ఎన్టీఆర్ పేద ప్రజలకు కూడా సామాజిక న్యాయం అందాలని పార్టీ పెట్టి వృద్ధులకు 25 రూపాయలు పింఛన్ మొదలై ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా 4000 రూపాయలు అందిస్తున్నామన్నారు. పేద బలహీన బడుగు వర్గాలకు మేలు చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వలనే సాధ్యమని ఆయన కొనియాడారు. సూపర్ సిక్స్ వలన ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఎలాంటి సమస్య అయినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలదాసు, చీకటి చార్లెస్, నజీర్ అలీ, కొండా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

3
78 views