logo

మర్రి నరేష్ నేటి ప్రధాన వార్త: ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు న్యాయం హక్కులు ప్రజా న్యాయస్థానం

​ఒక దేశం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లాలంటే కేవలం ఎన్నికలు జరగడం మాత్రమే సరిపోదు అక్కడ చట్టబద్ధ పాలన పౌరుల హక్కుల రక్షణ నిష్పక్షపాతమైన న్యాయవ్యవస్థ ఉండటం అత్యంత ముఖ్యం

​​న్యాయం అంటే కేవలం తీర్పులు చెప్పడం మాత్రమే కాదు సమాజంలో ప్రతి వ్యక్తికి వారి అర్హత మేరకు దక్కాల్సిన గౌరవం స్వేచ్ఛ అవకాశాలు లభించడం భారత రాజ్యాంగ పీఠిక మూడు రకాల న్యాయాలను నొక్కి చెబుతుంది ​సామాజిక న్యాయం కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడటం సంపద పంపిణీలో అసమానతలను తొలగించి పేదలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రతి పౌరుడికి రాజకీయాల్లో పాల్గొనే ఓటు వేసే సమాన హక్కు కల్పించడం న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి కాపలాదారు ఇది కార్యనిర్వాహక శాసన వ్యవస్థల నుండి స్వతంత్రంగా పనిచేస్తుంది ప్రభుత్వం చేసే చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుంది ప్రభుత్వం లేదా వ్యక్తుల మధ్య వచ్చే వివాదాలను చట్ట ప్రకారం పరిష్కరిస్తుంది రాజ్యాంగం కల్పించిన స్వతంత్రత వల్ల న్యాయమూర్తులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా తీర్పులు ఇవ్వగలరు ​ప్రజాస్వామ్యంలో పౌరులే అత్యంత శక్తివంతులు వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు అధికరణలు భారత రాజ్యాంగం ఆర్ట్రీకల్ 12 నుండి 35 వరకు వారి స్వేచ్ఛకు హామీ ఇస్తాయి చట్టం ముందు అందరూ సమానమే నచ్చిన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంట్టుంది ఆర్టికల్ 32 ఒకవేళ పౌరుల హక్కులకు భంగం కలిగితే వారు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు దీనినే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగపు ఆత్మ హృదయం అని పిలిచారు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా నడపబడే ప్రభుత్వం అని ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య విభజించబడి ఉంటుంది దీనివల్ల నిరంకుశత్వం తగ్గుతుంది
​న్యాయం అనేది గమ్యం అయితే న్యాయవ్యవస్థ ఆ గమ్యాన్ని చేర్చే మార్గం ప్రజాస్వామ్యం అనేది ఈ వ్యవస్థలన్నీ పనిచేయడానికి కావాల్సిన వేదిక మూడింటి కలయికతోనే ప్రజల హక్కులు సురక్షితంగా ఉంటాయి ప్రజలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండెల చూడాల్సిన బాధ్యత మీడియాపై కూడా కొంతవరకు ఉంటుంది ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవ్వాలంటే చదువుకున్న మేధావులు రాజ్యాంగం పట్ల అవగాహన సదస్సులు నిర్వహించాలి న్యాయం ఆలస్యం అవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అందుకే వేగవంతమైన చౌకైన న్యాయం ప్రజలందరికీ అందాలి భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు వాటిని సంరక్షించే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు వీటిని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రధాన హక్కు సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుండి 18 చట్టం ముందు అందరూ సమానమే కుల మత వర్గ లింగ వివక్ష చూపకూడదు అంటరానితనం నిషేధం​స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 19 నుండి 22 వరకు వాక్ స్వాతంత్ర్యం సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు దేశంలో ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ జీవించే హక్కు ఆర్టికల్ 21 ​పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23 నుండి 24 వెట్టిచాకిరీ మనుషుల అక్రమ రవాణా బాలకార్మిక వ్యవస్థను ఇది నిషేధిస్తుంది ​మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 25 నుండి 28 పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే ప్రచారం చేసే స్వేచ్ఛ
​విద్యా సాంస్కృతిక హక్కు ఆర్టికల్ 29 నుండి 30 అల్పసంఖ్యాక వర్గాల భాష లిపి సంస్కృతిని రక్షించుకునే హక్కు ​రాజ్యాంగ లో పొందుపరిచారు ప్రజల హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు దీనినే అంబేద్కర్ రాజ్యాంగపు హృదయం లేదా ఆత్మ హక్కు అంటారు ​భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యాయస్థానాలలో ఒకటి దీని అధికారాలను ప్రధానంగా ఇలా విభజించవచ్చు ​ప్రారంభ అధికార పరిధి కేంద్రం రాష్ట్రాల మధ్య లేదా రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను నేరుగా సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది ఆర్టికల్ 131
​అప్పీలేట్ అధికార పరిధి హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై అప్పీళ్లను సివిల్ క్రిమినల్ రాజ్యాంగ పరమైనవి సుప్రీంకోర్టు విచారిస్తుంది రాష్ట్రపతి కోరినప్పుడు ఏదైనా చట్టపరమైన లేదా ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై సుప్రీంకోర్టు తన సలహాను ఇస్తుంది ఆర్టికల్ 143 రైటింగ్ జూరిసడిక్షన్ ప్రాథమిక హక్కులను రక్షించడానికి సుప్రీంకోర్టు హేబియస్ కార్పస్ మాండమస్ ప్రోహిబిషన్ సెర్షియోరరీ కో-వారెంటో అనే 5 రకాల రిట్లను జారీ చేస్తుంది​ ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే దానిని కొట్టివేసే అధికారం కోర్టుకు ఉంటుంది ​కోర్ట్ ఆఫ్ రికార్డ్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు భవిష్యత్తులో దిగువ కోర్టులకు మార్గదర్శకాలుగా సాక్ష్యాలుగా పనిచేస్తాయి
​మీకు తెలుసా...? మొదట రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి కానీ 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి దానిని కేవలం ఒక చట్టబద్ధమైన హక్కుగా ఆర్టికల్ 300 మార్చారు రిట్లు అనగా సరళంగా ​రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం మీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని పునరుద్ధరించాలని మీరు సుప్రీంకోర్టును కోరవచ్చు అప్పుడు కోర్టు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలనే రిట్లు అంటారు ఇవి మొత్తం

5 రకాలు:

​1. హేబియస్ కార్పస్

​వ్యక్తిని హాజరుపరచండి అని అర్థం ​ఎప్పుడు వాడతారు ఒక వ్యక్తిని పోలీసులు లేదా ఎవరైనా అక్రమంగా నిర్బంధించినప్పుడు ఇది వాడతారు నిర్బంధించబడిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలి నిర్బంధం చట్టవిరుద్ధమని కోర్టు భావిస్తే ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయమని ఆదేశిస్తుంది

​2. మాండమస్

మేము ఆజ్ఞాపిస్తున్నాము అని అర్థం ​ఎప్పుడు వాడతారు ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ సంస్థలు తమకు కేటాయించిన చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వహించనప్పుడు దీనిని జారీ చేస్తారు బాధ్యత కలిగిన అధికారి తన పనిని సక్రమంగా చేసేలా కోర్టు ఆదేశిస్తుంది.

​3. ప్రోహిబిషన్

నిషేధించడం లేదా ఆపివేయడం ​ఎప్పుడు వాడతారు దిగువ కోర్టులు తమ అధికార పరిధిని మించి ఏదైనా కేసును విచారిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు దీనిని జారీ చేస్తుంది ఆ కేసు విచారణను అక్కడితో నిలిపివేయమని ఆదేశిస్తుంది.

​4. సెర్షియోరరీ

పూర్తిగా తెలుసుకోవడం లేదా ధృవీకరించుకోవడం దిగువ కోర్టులు తమ అధికార పరిధిని మించి తీర్పునిచ్చినప్పుడు లేదా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు దీనిని జారీ చేస్తారు దిగువ కోర్టు ఇచ్చిన తప్పుడు తీర్పును రద్దు చేసి ఆ కేసును పై కోర్టుకు బదిలీ చేయమని చెబుతుంది.

​5. కో-వారెంటో

ఒక వ్యక్తి చట్టబద్ధమైన అర్హత లేకుండా ఏదైనా ప్రభుత్వ పదవిని అధిష్టించినప్పుడు దీనిని జారీ చేస్తారు ఆ వ్యక్తి ఏ అధికారంతో ఆ పదవిలో ఉన్నారో వివరణ కోరుతుంది సంతృప్తికరమైన సమాధానం లేకపోతే ఆ పదవి నుండి తొలగిస్తుంది ​సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ద్వారా ఈ రిట్లను జారీ చేస్తుంది హైకోర్టు ఆర్టికల్ 226 ద్వారా ఈ రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది ​ప్రజల స్వేచ్ఛను కాపాడటంలో ఈ హేబియస్ కార్పస్ అనే రిట్ అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది


లోక్ అదాలత్ - ప్రజా న్యాయస్థానం

కోర్టులలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను లేదా కోర్టుకు వెళ్లకుండానే పరిష్కరించుకోదగ్గ వివాదాలను (రాజీ పడదగ్గవి) త్వరగా పరిష్కరించడానికి ఇవి పని చేస్తాయి ఇక్కడ తీర్పు త్వరగా వస్తుంది దీనిపై మళ్ళీ అప్పీలు చేసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఇది ఇరుపక్షాల అంగీకారంతో జరుగుతుంది ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం ప్రధాన లక్ష్యం ఇక్కడ ఇచ్చే తీర్పుకు సివిల్ కోర్టు తీర్పుతో సమానమైన గుర్తింపు ఉంటుంది
వివాహ సంబంధిత సమస్యలు, భూ తగాదాలు, రోడ్డు ప్రమాద భీమా కేసులు చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఇక్కడ పరిష్కరించుకోవచ్చు

25
3679 views