logo

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన నంద్యాల జిల్లా పోలీసులు

AIMA న్యూస్. కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ. ప్రవీణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS సూచనలతో ప్రతి శనివారం రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో ముఖ్యమైన ప్రాంతాలలో పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఆదేశాల మేరకు చాగలమర్రి నేషనల్ హైవేలో ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సులు వాహనాలకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని మరియు పరిమితికి మించి ప్రయాణికులను సరుకులను రవాణా చేయరాదు.బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు.

74
2739 views