శ్రీశైలం మల్లన్నకు వెండి వస్తువుల విరాళం
శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం. యం. జ్యోతిర్మయి, హైదరాబాద్ వారు ఒక వెండి పళ్ళెం, రెండు వెండి గిన్నెలు మరియు ఒక వెండి దీపం దేవస్థానమునకు విరాళంగా సమర్పించారు. ఈ వెండి వస్తువుల బరువు 630 గ్రాములుఅమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున,జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.