logo

దుప్పాడ, రాకోడు సచివాలయాల్లో మండల ప్రత్యేక అధికారి జ్యోతిశ్రీ తనిఖీ



విజయనగరం మండలం దుప్పాడ, రాకోడు, గొల్లపేట సచివాలయాలను మండల ప్రత్యేక అధికారి కె. జ్యోతిశ్రీ శనివారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

0
0 views